Trump: పుతిన్ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు 1 y ago
పలు దేశాలపై సుంకాల విధింపుతో దూసుకెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా రష్యాపై దృష్టి పెట్టారు. "ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోన్న వాస్తవం ఆధారంగా.. రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాలు విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తునాట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయి" అని ట్రంప్ అన్నారు. ఒకవేళ పుతిన్ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.